మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే జిల్లాలు తొలగించమని మనమే అనుమతి ఇచ్చినట్లే..నిరంజన్ రెడ్డి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే జిల్లాలు తొలగించమని మనమే అనుమతి ఇచ్చినట్లు అవుతుంది.

జిల్లాల సంఖ్య పెంచి 95% ఉద్యోగాలు స్థానిక యువకులు వచ్చేలాగా మేము ప్రణాళికలు చేశాము.

ఇప్పుడు జిల్లాలు తగ్గించి ఉద్యోగాలు ఆంధ్రా వాళ్లకు కట్టబెడతావా? జిల్లాలు తగ్గించడం వెనుక కుట్ర ఏంటి?.

3 కోట్ల జనాభా ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రంలో 40 జిల్లాలు ఉన్నాయి, 4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే తప్పేంది?…మేము కమిటీలు వేసి, చర్చలు జరిపి పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలోనే జిల్లాలు ఏర్పాటు చేసాము అంటు–
వనపర్తిలో చదువుకున్నా అని రేవంత్ రెడ్డి చెబితే ఏదైనా అభివృద్ధి చేస్తాడేమో అనుకున్నాను

కానీ వనపర్తి జిల్లాను తొలగించే ఆలోచనలో ఉన్నాడని, ఆయన మాటల్లో అర్థమైంది

కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డి ఆయన వ్యాఖ్యలను ఖండించాలి కదా? – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. అన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959