భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది…. తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరో సారి నోటీసులు జారీ చేసింది. 16వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. గతంలోనే కేటీఆర్ ఒక విడత విచారణకు హాజరయ్యారు. ఉత్కంఠత నడుమ విచారణ కు వెళ్లిన కేటీఆర్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగానే ఫార్ములా ఈ రేసు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. నగదు లావాదేవీల విషయంలోనే ఏసీబీ కేటీఆర్ నుంచి సమాచారం సేకరించింది….రెండో విడత విచారణ కోసం మే 28న విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికాలో జరగనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు వెళ్లాల్సి ఉన్నందును తను హాజరు కాలేనని ఆయన తేల్చి చెప్పారు. కాగా కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఈ సారి విచారణకు హాజరవుతారా.. మినహాయింపు కోరుతారా అనేది కీలకంగా మారుతోంది. అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్ ఇలా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విచారణలకు హాజరు కావటం రాజకీయంగా బీఆర్ఎస్ లో చర్చగా మారింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కనిపిస్తోంది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.