సందేశాత్మక చిత్రం ఓ నాన్న కథ
మంచి ప్రజాదరణ పొందిన చిత్రం
నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన చిత్రం
మెసేజ్ ఓరియెంటర్ చిత్రం గా గుర్తింపు
దేవరకొండ మనో థియేటర్లో ప్రదర్శించిన ఓ తండ్రి కథ..
చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి ..
ప్రొడ్యూసర్ గా లెంకల సాగర్ రెడ్డి..
మరిన్ని చిత్రాలను నిర్మిస్తా..
దేవరకొండ……..
కన్న బిడ్డలను అల్లారుముద్దుగా కని పెంచి పెద్ద చేసి వారి యొక్క కలలను సహకారం చేయడం కోసం తల్లిదండ్రులు పడేటువంటి కలలను బిడ్డలు సహకారం చేస్తారని ఆశించినటువంటి తరుణంలో ఎదురయ్యేటువంటి అనేక మైనటువంటి మలుపులతో కూడినటువంటి సందేశాత్మక చిత్రం ఓ నాన్న కథ అని ప్రొడ్యూసర్ లెంకల సాగర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆ చిత్రాన్ని స్థానిక మనోజ్ థియేటర్లో ప్రదర్శించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి ఆయన ప్రొడ్యూసర్ గా తండ్రిగా నటించినట్లు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా తండ్రి కూతురు విషయంలో ఎదురయ్యేటువంటి మలుపులను చిత్ర రూపకంగా రూపొందించినట్లు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు క్షణికావేశం లో తీసుకునేటువంటి నిర్ణయం వల్ల అటు కూతురు ఇటు తల్లిదండ్రులు ఎదుర్కొనేటువంటి సమస్యలను చిత్ర రూపకంలో రూపొందించినట్లు తెలిపారు. తాను గతంలోనే అశోక్ రెడ్డి, గులాబీమేడ ,శ్రీరంగ నాయక , షూటర్, తో పాటు ఓ తండ్రి కథ నిర్మించి విడుదల చేశానని వాటికి మంచి ప్రజాదరణ వచ్చిందని తెలిపారు. తనది గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామం అని తాను చిన్నతనం నుండి కలలు కలల పట్ల ఆసక్తి తన చిన్నతనంలో గ్రామాలలో నాటకాలు వేసే వాడిని తెలిపారు. తను నిర్మించేటువంటి సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకపోవడం బాధాకరమని చిన్న చిత్రాలను థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. తాను ఇంద్రపతి ,టెంపర్ కృష్ణ, ప్రేమిస్తే చావైనా, మరో మూడు చిత్రాలను నిర్మించబోతున్నానని విడుదలకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా థియేటర్ నుండి వచ్చిన ప్రేక్షకులు సైతం సినిమా పట్ల వారి అభిప్రాయాలను తెలియజేశారు.
స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ ఎల్ఐసి ఏజెంట్ గాజుల రాజేష్ లు మాట్లాడుతూ నేటి సమాజంలో యువత అన్నలోచిత నిర్ణయాల పట్ల ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల చిత్ర రూపకంగా సాగర్ రెడ్డి నిర్మించడం గొప్ప విషయం అని తెలిపారు. భవిష్యత్తులో సైతం మరిన్ని చిత్రాలను నిర్మించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు నంది వెంకట్ రెడ్డి కోట శంకర్రావు, మంచి కంటి వెంకటేశ్వర్లు తోట సుబ్బారావు ,హీరోయిన్ వరణ్య ,పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పున్నమి శైలజ వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ కార్యదర్శి లకుమారపు మల్లయ్య , కోశాధికారి కొండూరు ఆంజనేయులు ఎల్ఐసి సభ్యులు రాములు, రామలింగం, చారి లయన్స్ క్లబ్ జెడ్ సి వనం శ్రీనివాసులు, మాదిరెడ్డి సంధ్యారెడ్డి, గాజుల ఉషారాణి డిసి, చేరుపెల్లి జయలక్ష్మి , డాక్టర్ పి జె సామ్సన్, శివ పార్వతి ,మాకం సువర్ణ ,మక్కపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.