నియోజకవర్గ సమస్యలను పట్టించుకోని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాజీనామా చేయాలి…ఒంటెద్దు నర్సింహా రెడ్డి

హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రజలు ఉత్తంకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత రాష్ట్రంలో రెండు శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగా ఉండి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతున్నారని BRS పార్టీ హుజుర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహారెడ్డి ఆరోపించారు.. సమస్యల పరిష్కారానికి ముందుకు రాకుండా ప్రజలను అష్ట కష్టాల పాలు చేస్తున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదేదో మేము రాజకీయ ఆరోపణలు చేయట్లేము హుజూర్నగర్ నియోజకవర్గంలో కరెంటు కోతలు, కరెంటు లేక రైతులు స్వచ్ఛందంగా పాలకీడు మండలంలో నిన్న సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేసినారు. అలాగే నిన్న మఠంపల్లి మండలంలో రామచంద్రపురం తండలో హై టెన్షన్ లైన్లు చాలా కిందికి ఉండి ఒక 19 సంవత్సరాల యువకుడు చనిపోవడం జరిగింది.

అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ల బాగోతము ఇక చెప్పనవసరం లేదు. నిన్న మొన్నబడ్డ చిన్న వర్షానికి ఏసిన పైపులు పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకురావాలని లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు మొత్తం కూడా బయటపడి లీకులైపోయి మళ్లీ పైపులు దేనికి పనికి రాకుండా పోవడం జరిగింది.అలాగే నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో కూడా తాగునీటి సమస్యలు, మురుగు సమస్యలు ఏమి కూడా మంత్రిగారు పట్టించుకోవట్లేదు .
ఇక ఎరువుల సమస్య చెప్పనక్కర్లేదు షాపుల్లో లేని యూరియాను, ఎరువులను యాపుల్లో తెచ్చుకోవాలి అని చెప్పి చదువు రాని రైతులను యాప్ బుకింగ్ అని చెప్పి నానా ఇబ్బందుల పాలుచేస్తున్నారు.
నేను మొదటి నుంచి కూడా ఉత్తంకుమార్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాను. అయ్యా ఉత్తంకుమార్ రెడ్డి గారు మీ ఫోన్లో నుంచి మీరు గనక యాప్ లో ఒక్క యూరియా బస్తా అసలు మీరు బుక్ చేయగలుగుతారా అని సవాలు విసురుతున్నాను.యూరియా సప్లై చేయలేని మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాదులోనే ఎక్కువగా ఉంటున్నాడు, ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడు లేడు అధికారులు మంత్రిగారు లేరు కాబట్టి అలసత్వంలో ఉన్నారు. మంత్రిగారు హైదరాబాదు నుంచి ఢిల్లీకి గాలి మోటార్ల మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు గాలి మోటార్ల ఇది తప్ప ఉత్తంకుమార్ రెడ్డి గారు తనను ఎన్నుకున్న హుజూర్నగర్ ప్రజలను వారి సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు ఇయ్యాల ఆవేదన పడుతున్న అంశము అన్ని విధాల బయటపడుతుంది. నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడక ముందు పిసిసి తరఫున మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు 13 పథకాలు కావచ్చు అన్ని కూడా గాలిలో కలిసాయి.ఇగ రెండు శాఖలు మీరు నిర్వహిస్తున్నారు, ఒకటి నీటిపారుదల శాఖ రెండవది పౌరసరఫరాల శాఖ. ఈ రెండు శాఖలు నిర్వహించడంలో ఉత్తంకుమార్ రెడ్డి అసమర్థ మంత్రి అని తేలిపోయింది. నీటిపారుదల శాఖకు సంబంధించి గోదావరిలో నీళ్లు కన్నెపిల్లని ఎత్తిపోయడంలో వైఫల్యం, మెడిగడ్డలో క్రుంగిన 2 పిల్లర్స్ ను 32 నెల ఐనా రిపేర్ చేయలేకపోయారు. ఇప్పుడు కృష్ణ నదిలో జూరాల పైన ఉన్న కల్వకుర్తి, నెట్టెంపడు తదితర లిఫ్టులు మొదలు పెట్టకుండా శ్రీశైలంకి నీళ్లు వదిలి ఆంధ్రా పాలకులకు బానిసలని నిరూపించుకున్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రా పాలకులకు అవకాశం కల్పించారు. ఉత్తంకుమార్ రెడ్డి కల్వకుర్తి లిఫ్టు ప్రారంభించకుండా పోతిరెడ్డిపాడు నుండి ఆల్రెడీ శ్రీశైలం నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకపోతుంటే మీ మౌనం ఏమనుకోవాలి.
రెండవది వీరు నిర్వహిస్తున్న శాఖ పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు బియ్యం అమ్మకాలలో దాఖలు చేయబడ్డ టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది అన్ని పత్రికల్లో వచ్చిన అంశం. మీ మీద హైకోర్టులో 1150 కోట్ల అవినీతికి సంబంధించిన కేసు కేసు ఇయాల హైకోర్టులో పెండింగ్ ఉన్న మాట వాస్తవం కాదా ? ఉత్తంకుమార్ రెడ్డి మీరు పరిపాలన చేతకాని అసమర్ధ మంత్రి అనేది మేము చెప్పటం కాదు హుజూర్నగర్ ప్రజలే అనుకుంటున్న విషయం, కాబట్టి హుజూర్నగర్ ప్రజలకు అన్యాయం చేస్తు మంత్రిత్వ శాఖలను సమర్ధంగా నిర్వహించలేకపోతున్నటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అంటు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.. …