*పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్*
తిరుమల :
ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీ కు చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకెళతామని DFO వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు….
ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. సెక్యూరిటీ ఆడిట్లో భాగంగా ప్రయోగాత్మకంగా బోటింగ్ టీమ్ అక్కడ పర్యవేక్షించిందని అటవీ శాఖ తిరుపతి పాలనాధికారి, డీఎఫ్వో వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు..
ఇక్కడినుంచి బాలపల్లె, చిట్వేల్ అటవీ ప్రాంతం వరకు బయోస్పియర్ సరిహద్దులున్నందున రక్షణకు ఈ ప్రదేశం కీలకమవుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోస్పియర్ రిజర్వు పరిధిలో ఎకోటూరిజం అభివృద్ధికున్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తిరుమలవంటి పుణ్యక్షేత్రం పరిధిలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేముందు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, సమ్మతి లభిస్తేనే ముందుకెళతామని అన్నారు..