భారత ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్ కు చెందిన మరో వ్యక్తికి భారత పౌరసత్వం(Indian citizenship) అందించింది. భారత్తో లోతైన సంబంధాలను కలిగి ఉండి..గోవాలో చాలా కాలంగా నివసిస్తున్న పాకిస్తాన్(Pakistan)లో జన్మించిన షేన్ సెబాస్టియన్ పెరీరా(Shane Sebastian Pereira)కు భారత ప్రభుత్వం మంగళవారం పౌరసత్వం మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. దరఖాస్తుదారుడు అయిన షేన్ సెబాస్టియన్ పెరీరా, పాకిస్తాన్ పౌరుడు, 1981లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు పాకిస్తాన్ నివాసితులు. అతను పుట్టిన కొన్ని నెలల తర్వాత, అతని కుటుంబం భారతదేశానికి తరలివచ్చింది. అతను అప్పటి నుంచి భారత్ లోనే ఉంటూ.. గోవాలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ప్రస్తుతం, పెరీరా ఉత్తర గోవాలోని అంజునాలోని డెమెల్లో వద్దోలో నివసిస్తూండగా తాజాగా భారత ప్రభుత్వం పౌరసత్వాన్ని పొందాడు. దీంతో ఆయన ఇకనుంచి భారత పౌరులలో ఒకరిగా ఉంటారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.