నేటి పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 22 – 12 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనము,
హేమంత ఋతువు,
పుష్య మాసము,
శుక్ల పక్షము,

తిథి : *విదియ* ఉదయం 9.33 వరకు,
తదుపరి *తదియ*
నక్షత్రం : *ఉత్తరాషాఢ* తెల్లవారుజామున 4.39 వరకు
తదుపరి *శ్రవణం*
యోగం : *ధృవము* సా 4.42 వరకు
తదుపరి *వ్యాఘాతము*
కరణం : *కౌలువ* ఉ 9.33 వరకు
తదుపరి *తైతుల*

రాహుకాలం : ఉ 7.30 నుండి 9.00 వరకు
దుర్ముహూర్తం : మ12.20 నుండి 1.04 వరకు
తిరిగి 2.31 నుండి 3.15 వరకు.
వర్జ్యం : ఉ 11.38 నుండి 1.20 వరకు
అమృతకాలం : రా 9.51 నుండి 11.33 వరకు
సూర్యోదయం : 6.28,
సూర్యాస్తమయం : 5.26,

నేటి పాశురం.

తిరుప్పావై – 7వ పాశురము.

_*కీశు కీశెన్రెఙ్గుమానై చ్చాత్తఙ్గలన్దు !*_
_*పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే !*_
_*కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు*_
_*వాశ నరుఙ్గుళ లాయిచ్చియర్; మత్తినాల్*_
_*ఓశైప్పడుత్త త్తయిర రవమ్ కేట్టిలైయో*_
_*నాయకప్పెణ్పిళ్లాయ్ ! నారాయణన్ మూర్తి*_
_*కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో*_
_*తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.*_

_*తాత్పర్యము:–*_

భరద్వాజపక్షులు పగలువిడిపోదుము కదా యని తెల్లవారుజామున కలసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆమాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా!
ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతమగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునపుడు, వారిచేతుల కంకణధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలసి, విజృంభించి, ఆకాశము నంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా! ఓ నాయకురాలా! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కన్పడవలెననిమూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా! నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దాని నడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లుతలుపు తెరవవలయును.

శుభమస్తు.
సమస్త లోకా సుఖినోభవంతు