పశ్చిమ బెంగాల్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిని బీజేపీ. !

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వేళ, రాజకీయ సమీకరణాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి…

Total Seats: 287/294
Majority: 148
Party Lead Won Total
NDA 181 0 181
TMC+ 103 0 103
LF+ 2 0 2
JUP+ 1 0 1
OTH 0 0 0

బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం 190 సీట్లకు పైగా పెరగడంతో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ భారీ ఓటమిని చవిచూడబోతోంది..

పోస్టల్ బ్యాలెట్ల (Postal Ballot) లెక్కింపు పూర్తి కాగా ఈవీఎం (EVM) ట్రెండ్స్ వెలువడుతున్నాయి. పలు కీలక నియోజకవర్గాల్లో ప్రముఖుల భవితవ్యం క్షణక్షణం మారుతోంది. పశ్చిమ బెంగాల్‌లో హై-ప్రొఫైల్ నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి (Suvendu Adhikarai) స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarji) తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బెంగాల్‌లో టీఎంసీ (TMC), బీజేపీ (BJP)ల మధ్య సీట్ల లెక్కల్లో హోరాహోరీ పోరు సాగుతోంది..

తాజా ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ (BJP) బెంగాల్ పీఠాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. మొత్తం 294 స్థానాలకు గానూ బీజేపీ 154 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (148)ను దాటేసింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఎంసీతో హోరాహోరీగా తలపడినప్పటికీ, ఈవీఎంల లెక్కింపు మొదలైన మొదటి రెండు రౌండ్లలో బీజేపీ తన పట్టును చాటుకుంది. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ లీడ్లో కొనసాగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పట్టు నిలుపుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం టీఎంసీ 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీ, టీఎంసీ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కేవలం వందల్లోనే ఉండటం గమనార్హం. ప్రతి రౌండ్ ముగిసే కొద్దీ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉండటంతో, అభ్యర్థులు మరియు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ స్వల్ప తేడాలే చివరికి నిర్ణయాత్మకం కానున్నాయి.

ప్రారంభ ట్రెండ్స్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటేయడంతో, అప్పటివరకు కోలాహలంగా ఉన్న తృణమూల్ కార్యాలయాలు క్రమంగా వెలవెలబోతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పదేళ్ల అధికారానికి తెరపడనుందా అనే ఆందోళన టీఎంసీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మరోవైపు, బీజేపీ శ్రేణులు విజయోత్సాహంతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రౌండ్లు గడిచే కొద్దీ ఈ ఫలితాలు మరింత స్పష్టతనివ్వనున్నాయి…

అంతకు ముందు…

బెంగాల్లో హై-డ్రామా..మమత వెనుకంజ.. నివాసం మార్పు!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఊపిరి బిగబట్టేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అధికార టీఎంసీ (TMC), బీజేపీల మధ్య పోరు ఫోటో ఫినిష్ను తలపిస్తోంది. మొత్తం స్థానాల్లో టీఎంసీ 98, బీజేపీ 95 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అత్యంత కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.మరోవైపు భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇదే సమయంలో ఆమె తన అధికారిక నివాసాన్ని వీడి, సొంతింటికి బయలుదేరడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.