బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 74.23 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అలా అయితే.. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 80 నుంచి 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది..ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకరంగా యుద్ధం నడుస్తోంది. రెండు దేశాలు మిస్సెల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. నిన్న ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణం కంటే 10 శాతం ఎక్కువైపోయాయి. ముడి చమురు ధరలు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పెరగటం జనవరి నుంచి ఇదే మొదటి సారి…బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 74.23 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అలా అయితే.. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 80 నుంచి 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు పెరిగితే.. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి దేశీయ ఇంధన విక్రయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రూడ్ ధర ఒక డాలర్ పెరిగితే, మన ఇంధన కంపెనీల లాభానికి 200-300 కోట్ల రూపాయల వరకు గండి పడుతుందని అంచనా..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.