పోలవరం ప్రాజెక్టుపై పీపీఏ కీలక సమావేశం: 14 అంశాలపై చర్చ…

పోలవరం ప్రాజెక్టుపై పీపీఏ కీలక సమావేశం: 14 అంశాలపై చర్చ.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నవంబర్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీపీఏ ఆఫీసులో 17వ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించడం, ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలు, పోలవరం-బనకచర్ల లింక్ వంటి 14 అంశాలపై చర్చించనున్నారు.