బావ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బావమరిది హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణం..!

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి కుటుంబం బలవన్మరణం ఘటనలో విస్తుపోయే విషయాలు..

బావ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బావమరిది హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తూ, తన బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చిన బావ శ్రీహరి

వాటిని తిరిగి ఇవ్వాలని శ్రీహరి కోరడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం ఇద్దరికి సూపారీ ఇచ్చి.. జూన్ 15న పెంచలకోనకు కారులో తీసుకెళ్లిన బావమరిది హరికృష్ణ

తిరిగి వస్తుండగా అప్పటికే దారిలో మాటు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు వీరి కారును ఆపి, శ్రీహరికి కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య.. గుండెపోటుతో చనిపోయాడని తెలిపిన హరికృష్ణ

మృతుడి శరీరంపై గాయాలు ఉన్నా ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు..

దీంతో తన భర్త హత్యకు గురయ్యాడని ఎస్పీకి జూలై 6న ఫిర్యాదు చేసిన శ్రీహరి భార్య లావణ్య.. బయటపడ్డ పోలీసుల అవినీతి..

హత్యను పక్కదారి పట్టించేందుకు రూ.75 లక్షలకు కుదిరిన భారీ డీల్.. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా ఉండడానికి రూ.25 లక్షలు తీసుకున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి అంటు ఆరోపణలు..

కిందిస్థాయి పోలీసులకు, స్థానిక రాజకీయ నాయకులకు, ఇతరులకు రూ.50 లక్షలు పంచిన హరికృష్ణ.

కేసును పక్కదారి పట్టించినందుకు సీఐతో పాటు స్టేషన్‌లో ఉన్న 23 మందిపై బదిలీ వేటు.. సీఐను వీఆర్‌కు పంపి, సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన ఎస్పీ.

ఇదిలా ఉండగా పరారీలో ఉన్న హరికృష్ణ మంగళవారం రైలు కిందపడి కుటుంబంతో సహా ఆత్మహత్య.

తాజా కథనాల ప్రకారం.. బావ శ్రీహరి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తూ తన బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చాడు. అయితే ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలని శ్రీహరి కోరడంతో బావమరిది హరికృష్ణ అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం ఇద్దరికి సుపారీ ఇచ్చి.. జూన్ 15న పెంచలకోనకు కారులో తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా అప్పటికే దారిలో మాటు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు వీరి కారును ఆపి, శ్రీహరికి కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేశాడు. బావ శ్రీహరి గుండెపోటుతో చనిపోయాడని హరికృష్ణ తెలుపగా.. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో శ్రీహరి భార్య లావణ్య తన భర్త హత్యకు గురయ్యాడని ఎస్పీకి జూలై 6న ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల అవినీతి బయటపడ్డది.

డైవర్షన్‌ కోసం భారీ డీల్..

హత్యను పక్కదారి పట్టించేందుకు హరికృష్ణ రూ.75 లక్షలకు కుదిరిన భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తేలింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా ఉండడానికి రూ.25 లక్షలు తీసుకోగా.. కిందిస్థాయి పోలీసులకు, స్థానిక రాజకీయ నాయకులకు, ఇతరులకు రూ.50 లక్షలు పంచినట్టు నిర్దారణ అయింది. కేసును పక్కదారి పట్టించినందుకు సీఐతోపాటు స్టేషన్‌లో ఉన్న 23 మందిపై ఎస్పీ బదిలీ వేటు వేశారు. సీఐను వీఆర్‌కు పంపి, సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా పరారీలో ఉన్న హరికృష్ణ మంగళవారం రైలు కిందపడి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.