ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వృద్ధిగాథలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాపారులను ఆహ్వానించారు. సాంకేతికత కేవలం సౌలభ్యం కోసమే కాదని, సమానత్వ సాధనమని మోదీ నొక్కి చెప్పారు. ఈ మేరకు వాణిజ్య రాజధాని ముంబయిలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పలు వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది!
“సమ్మిళిత విధానం మన బ్యాంకింగ్ వ్యవస్థను మార్చివేసింది. గతంలో ఇది ఒక ప్రత్యేక హక్కు. కానీ డిజిటల్ టెక్నాలజీ దానిని సాధికారత సాధనంగా మార్చింది. నేడు డిజిటల్ చెల్లింపు రోజువారీ జీవితంలో ఒక భాగం. దీనికి ఘనత JAM ట్రినిటీ (జన్ ధన్, ఆధార్, మొబైల్) కు చెందుతుంది” అని మోదీ తెలిపారు. భారతదేశ ఫిన్టెక్ ప్రపంచ గుర్తింపు పొందుతోందని, ఇతర దేశాలతో సాంకేతికతను పంచుకోవడమే కాకుండా దానిని అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుందని చెప్పారు.
ఆర్థికం అంటే సంఖ్యలు మాత్రమే కాదు!
“భారతదేశంతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని నేను UKతో సహా అన్ని దేశాలను ఆహ్వానిస్తున్నాను. భారతదేశ వృద్ధి గాథలో పాల్గొనడానికి ప్రపంచ పెట్టుబడిదారులందరికీ స్వాగతం. సాంకేతికత, ప్రజలు, ప్లానెట్ అన్నీ అభివృద్ధి చెందగల ఫిన్టెక్ ప్రపంచాన్ని మనం సృష్టించాలి. ఆవిష్కరణ లక్ష్యం కేవలం వృద్ధి మాత్రమే కాదు. మంచితనం కూడా కావాలి. ఆర్థికం అంటే సంఖ్యలు మాత్రమే కాదు, మానవ పురోగతి” అని మోదీ తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు, అది ఎన్నికలు, విధాన రూపకల్పనకే పరిమితం కాదని తెలిపారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాలనకు బలమైన స్తంభంగా మార్చిందని మోదీ అన్నారు. దీనికి ఉత్తమ ఉదాహరణ సాంకేతికతగా చెప్పారు..
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం MSMEలను పెంచుతుంది!
మరోవైపు, భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం MSMEలను పెంచుతుందని, ఉద్యోగాలను సృష్టిస్తుందని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం 2030 లక్ష్య తేదీ కంటే ముందే సాధించవచ్చని చెప్పారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో కలిసి CEO ఫోరమ్లో ప్రసంగిస్తూ మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భారత్, యూకే మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) స్థిరత్వాన్ని అందిస్తుందని అన్నారు.
భారత్, UKలోని పరిశ్రమ నాయకులను అవకాశాలను ఉపయోగించుకోకుండా అడ్డంకులను తొలగించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు ఏమి చేయగలవో జాబితా చేయాలని స్మార్టర్ కోరారు. “ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సామర్థ్యాన్ని పెంచడానికి మేము మీకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం” అని స్టార్మర్ అన్నారు. జులైలో CETA సంతకం చేసిన మూడు నెలల్లో వాణిజ్యం, పెట్టుబడులలో 6 బిలియన్ పౌండ్ల పెరుగుదల ఉందని అన్నారు..బ్రిటిష్ కంపెనీలకు అవకాశాలను పెంచడానికి, యునైటెడ్ కింగ్డమ్లోకి డజన్ల కొద్దీ కొత్త పెట్టుబడులను అందించడానికి, ఉద్యోగాల వృద్ధికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి మేం యూకే-ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ను ప్రారంభిస్తున్నాం. ఈ వారం ఇతర అద్భుతమైన విజయాలు చిత్రనిర్మాణంలో వచ్చాయి. యునైటెడ్ కింగ్డమ్లో మూడు కొత్త బాలీవుడ్ బ్లాక్బస్టర్లు నిర్మిస్తాయని ప్రకటించారు. లాంకాస్టర్ విశ్వవిద్యాలయం, సర్రే విశ్వవిద్యాలయం భారత్లో కొత్త క్యాంపస్లను ప్రారంభిస్తాం. మన ప్రజల మధ్య మానవ సంబంధాలు నిజంగా ప్రత్యేకమైనవి. కాబట్టి ఈ వారం వాటన్నింటిపై నిర్మించుకున్నాం. మా చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై నిర్మించాం. మేము ఈ భాగస్వామ్యాన్ని మన కాలానికి పునర్నిర్మిస్తున్నాం. భవిష్యత్ అవకాశాలను కలిసి గెలుచుకోవడం, వాటిని తీసుకురావడంపై దృష్టి సారించాం” అని కీర్ స్మార్టర్ తెలిపారు..