Question paper leakage | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Professor Jayashankar Agriculture University) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్ వ్యవసాయ కాలేజీ (Warangal Agriculture College) సిబ్బంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. ఈ వ్యవహారంలో విద్యార్థులు ప్రొఫెసర్లను తమ బుట్టలో వేసుకోవడానికి ఖరీదైన మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్లకు గోవా వంటి ప్రాంతాలకు విహారయాత్రలు ఏర్పాటు చేయడం, ఖరీదైన లిక్కర్ దావత్‌లు ఇవ్వడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ రకమైన ‘విందు రాజకీయాల’ వల్ల పరీక్షా పత్రాల గోప్యత గాలికి కలిసిపోయింది. విద్యార్థులు విలాసాల ఎర వేసి, ప్రొఫెసర్ల ద్వారా ముందుగానే ప్రశ్నపత్రాలను సంపాదించి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు..ప్రొఫెసర్ల చేతికి పరీక్షకు ఒక రోజు ముందు ప్రశ్నపత్రాలు అందుతుండగా, వారు వాటిని ల్యాబ్ టెక్నీషియన్ల సహాయంతో జిరాక్స్ తీయిస్తున్నారు. అనంతరం ఆ పత్రాలను రహస్య వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్-సర్వీస్ విద్యార్థులకు పంపిస్తున్నారు. ఒక్కో ప్రశ్నపత్రం కోసం లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వరంగల్, జగిత్యాల వ్యవసాయ కళాశాలలు ఈ అక్రమాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వరంగల్ కాలేజీకి చెందిన ఒక విద్యార్థి బ్యాంక్ ఖాతా నుంచే దాదాపు 12 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించడం ఈ కుంభకోణం యొక్క తీవ్రతను తెలియజేస్తోంది.ఈ అక్రమాల్లో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ చదువుతున్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEOs), ఇతర ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో సీట్లు పొంది, ప్రమోషన్ల కోసం ఈ అడ్డదారులు తొక్కుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఈఓ (AEO) యూనియన్ నేతలు రంగంలోకి దిగి, ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండాలంటే ప్రస్తుతమున్న ‘ఇన్-సర్వీస్ అగ్రికల్చర్ బీఎస్సీ’ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలు వీరి హస్తమే..!
ఏఈవోలు పని చేస్తూ యూనివర్సిటీలో ఇన్ సర్వీస్ కోటా కింద చదువుతున్న 35 మంది కలిసి దీనికి పాల్పడ్డట్లు తేల్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పలువురు యూనివర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇన్‌సర్వీస్ కోటా కింద చదువుతున్న 35 మందిని డిస్మిస్ చేసి, వ్యవసాయ శాఖకు సరెండర్ చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారం వరంగల్ కాలేజీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు…
మంది ప్రవేశాలు రద్దు
వరంగల్ కాలేజీ సిబ్బంది సైతం లీకేజీకి సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. 8 మంది ఇన్ సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. లీకేజ్ వ్యవహారంపై ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేశారు. పలు వ్యవసాయ కాలేజీల్లో కమిటీ సభ్యుల రహస్య విచారణ చేపట్టనున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959