రాహుల్ గాంధీ పీఏ నంటూ సయ్యద్ బురానుద్దీన్.. మోసాలు….!.

రాహుల్ గాంధీ పీఏ నంటూ మోసాలు.. అరెస్ట్ చేసిన మొయినాబాద్ పోలీసులు..

పలువురు వీవీఐపీలు పేరుతో మోసాలకు పాల్పడ్డ సయ్యద్ బురానుద్దీన్..

రాహుల్ గాంధీ పీఏ నంటూ ఛత్తీస్‌ఘడ్ మోసాలు..

ఏకంగా ఛత్తీస్‌ఘడ్ సీఎం కార్యాలయం సిబ్బందికే కుచ్చుటోపి

మైనింగ్ ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మేర మోసం

ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని మోసం చేసిన ఘనుడు

పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్‌ను నమ్మించిన మోసగాడు

ఐఏఎస్ పై అప్పటికే కొనసాగుతున్న సీబీఐ ఎంక్వయిరీని రద్దు చేపిస్తానంటూ.. కోటిన్నర రూపాయలు తీసుకొని పారిపోయిన జాదుగాడు

హైదరాబాదులో ఓ బిజినెస్‌మెన్‌కు ఈడీ అధికారులు నోటీసులో జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తి

నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించిన కేటుగాడు..

అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు..

మొయినాబాద్‌లో రెండేళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో కేసు నమోదు..

ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు..

విచారణలో వెలుగులోకి వచ్చిన సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు..

ఇతని పై 12 పోలీస్ స్టేషన్లో పలు కేసులు….