గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉదయం వరకు విపరీతమైన ఎండ..
మధ్యాహ్నం ఉక్కపూత…
సాయంత్రం వర్షం..
చిత్రంగా మారిన వాతావరణం..
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ మహా నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. హైదరాబాద్ లో పది నిమిషాల వర్షానికే రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు…ఇవాళ్లి నుంచి రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. యాదాద్రి- భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు పేర్కొన్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. అలాగే పలు ప్రాంతాల్లో పిడుగుల పడే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లో సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు వెళ్లొద్దని.. ఆఫీసులకు వెళ్లిన వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు….
ఉదయం బీభత్సమైన ఎండ..
ఎండాకాలం కూడా లేనంతగా వాతావరణం ఒక్కసారిగా వేడి ఎండతో మారిపోతుంది… ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు…
సాయంత్రం కాగానే ఒక్కసారిగా చల్లబడుతూ వర్షం వస్తుంది..
ఏకకాలంలోనే మూడు రకాల వాతావరణంలో చూపి స్తూ భిన్నమైన వాతావరణాన్ని ప్రజలు చూడాల్సి వస్తుంది…