చెక్కులకు సంబంధించి నేటి నుంచి RBI కొత్త నియమాలు అమలులోకి వస్తున్నాయి.
ఇకపై రోజుల తరబడి కాకుండా, చెక్కు ట్రంకేషన్ సిస్టం ఆధారంగా కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతాయి.
చెక్కును భౌతికంగా పంపాల్సిన అవసరం ఉండదు, దాని ఫోటో, వివరాలు పంపితే సరిపోతుంది.
భద్రత కోసం పాజిటివ్ పే సిస్టమ్ను కూడా RBI తప్పనిసరి చేసింది..
చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (Cheque Truncation System – CTS) అనేది బ్యాంకుల మధ్య ఫిజికల్ చెక్కును పంపే బదులుగా, దాని స్కాన్ చేసిన ఇమేజ్, అవసరమైన వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపే పద్ధతి. దీని వల్ల చెక్కుల క్లియరెన్స్ వేగవంతం అవుతుంది. మోసాలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే బ్యాంకులు చెక్కు ఇమేజ్, MICR కోడ్, సంతకం వంటి వివరాలను సమాంతరంగా చెక్ చేయగలవు. CTS వల్ల చెక్కులు ఎక్కడికీ వెళ్లకుండానే అదే రోజులో చెల్లింపుకు సిద్ధమవుతాయి. కాబట్టి నగదు ప్రవాహం వేగంగా జరిగి ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం వస్తుంది.