టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో నూతన 4జి ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈ ఫోన్ను జియో విడుదల చేసింది. జియో భారత్ పేరిట ఈ ఫోన్ను లాంచ్ చేశారు. సేఫ్టీ ఫస్ట్ అనే నినాదంతో ఈ ఫోన్ను లాంచ్ చేసినట్లు జియో తెలియజేసింది. కుటుంబ సభ్యుల మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్ను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. దీని వల్ల ఎంతో మందికి ఫోన్ సదుపాయం చాలా తక్కువ ధరకే లభిస్తుందని, తక్కువ ధరకే 4జి సేవలను ఉపయోగించుకునే సదుపాయం ఉంటుందని జియో చెబుతోంది. జియో భారత్ ఫోస్ వల్ల కుటుంబాలు తమ పిల్లలకు, వృద్ధులైన తల్లిదండ్రులకు, ఒంటరిగా జీవిస్తున్న వారికి దగ్గరగా ఉండవచ్చని జియో తెలియజేసింది. అందుకనే ఈ ఫోన్లకు గాను సేఫ్టీ షీల్డ్ అనే సదుపాయాన్ని అందిస్తున్నామని తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.