ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరికొన్ని గంటలోనే ప్రారంభం కానుంది. సాయంత్రం 7:30 గంటలకు తొలి మ్యాచ్ కూడా షురూ అవుతుంది..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad ) మధ్య తొలి ఫైట్ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ( Rohit sharma ) చూసి ఆ జట్టుకు సంబంధించిన ఓనర్ నీతా అంబానీ ( Nita Ambani ) బోల్డ్ కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మ కత్తిలా ఉన్నాడని, యంగ్ కుర్రాడిలా మారిపోయాడని కితాబ్ ఇచ్చారు. రోహిత్ శర్మ ఫిట్నెస్ గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దీంతో రోహిత్ శర్మ కూడా టక్కున నమ్మేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది…25 కేజీలు తగ్గిన రోహిత్ శర్మ
టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ
( Rohit Sharma) 25 కేజీలు తగ్గిన సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ లో ( 2027 ODI World Cup ) ఆడడమే లక్ష్యంగా రోహిత్ శర్మ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు ఏడాది కాలంగా ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఇందులో భాగంగానే ఆరు నెలల కిందట దాదాపు 20 నుంచి 25 కేజీలు తగ్గాడు రోహిత్ శర్మ. దీంతో కుర్ర రోహిత్ శర్మ లాగా కనిపిస్తున్నాడు. తన అటాకింగ్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉంది.
ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఫిదా అయిపోయారు. రోహిత్ శర్మ కరెంటు తీగల సన్నగా తయారయ్యాడని ఆమె ప్రశంసించారు. అతన్ని చూస్తే, కుర్ర క్రికెటర్ లాగా ఉన్నాడని.. అతని శరీర ఆకృతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇలా రోహిత్ శర్మ మారడంతో లవ్ యు అంటూ సిగ్నల్స్ ఇచ్చారు నీతా అంబానీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కానీ అంబానీ భార్య నీతా తీసిన కామెంట్లు రోహిత్ శర్మ ( Rohit Sharma) సతీమణి రితికా ( Rithika) చూస్తే మాత్రం ఇంట్లో పంచాయతీ ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు..