పల్లెలకు చేరని పల్లె వెలుగు బస్సు… విద్యకు దూరమవుతున్న విద్యార్థులు..!

పల్లె దాటాలంటే ఆటోలే గతి..!

*బస్సులు లేక విద్యార్థుల ఇక్కట్లు…

బస్సులు రాకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం….

పేరుకే పల్లె వెలుగు పల్లెకి చేరని పల్లె వెలుగు బస్సు.. కరోనాకాలం నుండి అసలే చదువులకు దూరంగా ఉన్న విద్యార్థులు… లాక్ డౌన్ సమయంలో రద్దయిన బస్సులు నేటి వరకు కూడా పల్లెలకు చేరడం లేదు…. పల్లెకు వెళ్లాలంటే పల్లె వెలుగులు ని వదిలేసి ఆటోలలో ప్రయాణించే పరిస్థితికి దాపురించింది.. ఉమ్మడి నల్గొండ జిల్లా లొ చాలా గ్రామాలకు రొడ్లు ఉన్న కనీసం బస్ సౌకర్యం లేదు అంటె చూడాలి పాలకులకు, అధికారులకు గ్రామాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది…. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో తండాలు ఎక్కువగా ఉండటం కనీసం ఏరియాకి బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు సైతం విద్యకు దూరమవుతున్నారు… నిత్యం ప్రతి పనికి పట్నం వచ్చే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆటోలే శరణ్యంగా మారింది…

ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి
బస్సులు నడపాలని విజ్ఞప్తి..
ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి పలు గ్రామాలకు బస్సులు లేక పోవడంతో స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళలేక మధ్యలోనే చదువులు ఆపి పనులకు పోవల్సివస్తుందని అనేకమంది విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….
అధికారులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుండి గానుగబండ వరకు,హుజూర్ నగర్ నుండి యాతవాకిళ్ల, చెన్నాయిపాలెం వర్ధాపురం,భిల్యానాయక్ తండా వరకు,
హుజూర్ నగర్ నుండి మఠంపల్లి,
గుండ్లపల్లి–మట్టపల్లి..
గరిడేపల్లి మండలం,, నేరేడుచర్ల మండలంలో గ్రామాలకు రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో బస్సులు నడపాలని విద్యార్థులు,తలిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు…