విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం.. రివ్యూ..

వెంకటేష్‌ ఇటీవల కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోతున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఎక్కడో మిస్‌ ఫైర్‌ అవుతుంది. గతంలో మాదిరిగా విజయాలు దక్కడం లేదు. దీంతో తనకు బలం అయిన వినోదాన్ని నమ్ముకుని వస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేశారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా మంగళవారం(జనవరి 14)న విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం…

వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి

నిర్మాత : శిరీష్.
మ్యూజిక్ : భీమ్స్‌ సిసిరోలియో

ఎడిటింగ్ : తమ్మిరాజు

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి..
దర్శకత్వం : అనిల్ రావిపూడి

బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా ఫ్యామిలీ సబ్జెక్ట్ లలో నటించి విజయాలను అందుకున్నారు. గత కొంతకాలంగా వెంకటేశ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటుండగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. వెంకటేశ్ నటించిన కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజయ్యాయి. అయితే వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా ఈ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం కావడం గమనార్హం.

కథ :

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకున్న ఎక్స్ కాప్ వైడీ రాజు (విక్టరీ వెంకటేశ్) తన భార్య భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యం(ఐశ్వర్య రాజేష్), పిల్లలతో రాజమండ్రి దగ్గర సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. మరోవైపు అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ హెడ్ అయిన సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేశవ్ (వీకే నరేష్) పార్టీకి హాజరైన సమయంలో బిజ్జు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేసి బిజ్జూ సోదరుడు పప్పా పాండేను రిలీజ్ చేస్తే మాత్రమే సత్య ఆకెళ్లను రిలీజ్ చేస్తామని డిమాండ్ చేస్తారు.

సీఎం కేశవ్ ఈ కిడ్నాప్ వల్ల తమ పరువు పోతుందని భావించి ఐపీఎస్ ఆఫీసర్ మీనూ (మీనాక్షి చౌదరి) ద్వారా వైడీ రాజును ఈ కేసును పరిష్కరించాలని కోరుతారు. వైడీ రాజు మీనూ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? వైడీ రాజు ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? ఒకవైపు భార్య, మరోవైపు మాజీ ప్రేయసి వైడీ రాజుకు ఏ విధంగా చుక్కలు చూపించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

విక్టరీ వెంకటేశ్ కు ఈ తరహా సినిమాలలో నటించడం, తన పాత్రతో మెప్పించడం కొత్తేం కాదు. వైడీ రాజు పాత్రలో అలవోకగా అద్భుతంగా నటించి వెంకటేశ్ తన నటనతో మెప్పించారు. ఐశ్వర్య రాజేష్ వైడీ రాజు భార్య పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఒకింత అమాయకత్వంతో ఒకింత పొసెసివ్ నెస్ తో ఉన్న పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. మీనాక్షి చౌదరి మీనూ పాత్రలో అందం, అభినయంతో మెప్పించారు. వెంకటేశ్ కొడుకు బుల్లిరాజు పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్ లో బుల్లిరాజు పాత్ర కీ రోల్ పోషించింది. శ్రీనివాస్ రెడ్డి, వీటీవీ గణేష్, వీకే నరేష్, అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధిమేర నటించి తమ నటనతో మెప్పించారు. అనిల్ రావిపూడి మార్క్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఫస్టాఫ్ ను అద్భుతంగా తెరకెక్కించిన అనిల్ రావిపూడి సెకండాఫ్ విషయంలో మాత్రం కొంత తడబడ్డారు. ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా నిలవగా కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్ అనిపించేలా ఉన్నాయి. వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ చేరిందని చెప్పవచ్చు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తన పాటలు, బీజీఎంతో సినిమా స్థాయిని పెంచారు. గోదారి గట్టు, మీనూ, బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్స్ సిల్వర్ స్క్రీన్ పై బాగున్నాయి. అనిల్ రావిపూడి ఈ సాంగ్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటర్ తమ్మిరాజు సెకండాఫ్ లో కొన్ని సీన్స్ నిడివి తగ్గించి ఉంటే సినిమా మరింత ఎక్కువమంది ప్రేక్షకులను మెప్పించేది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పాస్ మార్కులు వేయించుకుంది. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఖర్చు విషయంలో కొంతమేర రాజీ పడ్డారు…

నటీనటులు.

వెంకటేష్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా కంటే ఫ్యామిలీ మ్యాన్‌గా ఆకట్టుకున్నారు. తనదైన కామెడీతో రెచ్చిపోయాడు. ఇద్దరు లేడీస్‌ మధ్య ఇరుక్కుపోయి నలిగిపోయిన పాత్రలో ఇరగదీశాడు. ఇది ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు. అదే సమయంలో డాన్సులతో, పాటతోనూ ఆకట్టుకున్నారు. ఐశ్వర్యా రాజేష్‌ వెంకీని డామినేట్‌ చేసిందని చెప్పొచ్చు. ఆమె పాత్రకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఈర్ష్య పడే, అనుమానించే భార్య పాత్రలో జీవించింది. ఐష్‌ పాత్ర వల్ల మీనాక్షి పాత్ర కూడా హైలైట్‌ అయ్యింది. ఆమె కూడా బాగా చేసింది. మామగా మురళీధర్‌ గౌడ్‌ రెచ్చిపోయాడు. సీఎంగా నరేష్‌ ఆకట్టుకున్నారు. పార్టీ ప్రెసిడెంట్‌గా వీటీవీ గణేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యింది. ఆకేళ్లగా శ్రీనివాస్‌ అవసరాలకి నటించడానికి పెద్దగా ఏం లేదు. జైలర్‌గా యానిమల్‌ నటుడు ఉపేంద్ర ఇరగదీశాడు. కానీ ఆయన కామెడీ ఓవర్‌ బోర్డ్ అయ్యింది. కానిస్టేబుల్‌ మాణిక్యంగా సాయికుమార్‌ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా వెంకీ కొడుకుగా చేసిన బుడ్డోడు మాత్రం దుమ్ములేపాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి…

టెక్నికల్‌గా ఎలా ఉందంటే….

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ తో బీన్స్ సిసిరియో 100% మార్కులు కొట్టేసాడు. సినిమా రిలీజ్ కు ముందే హైప్ వచ్చింది. ఇక తెరపై పాటలను బ్యాగ్రౌండ్ స్కోర్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లాడు. సమీర్ రెడ్డి ప్రతి సీను అందంగా తెరకెక్కించాడు. గోదావరి అందాలను చక్కగా కెమెరాల్లో చిత్రీకరించారు. తమ్మి రెడ్డి ఎడిటింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోసారి దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమా అందించారు..

ప్లస్ పాయింట్స్.:

వెంకటేశ్ యాక్టింగ్

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ

మ్యూజిక్, బీజీఎం

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ

సెకండాఫ్ లో కొన్ని ల్యాగ్ సన్నివేశాలు

వెంకటేశ్ గత సినిమాలను గుర్తు చేసేలా స్క్రీన్ ప్లే..

సాంగ్స్..
కుటుంబంతో కలిసి చూసే చిత్రం అని చెబుతున్నారు. బుల్లి రాజు పాత్రలో వెంకీ నటన అదుర్స్ అని అంటున్నారు. ‘గోదారి గట్టు’ సాంగ్ థియేటర్ లలో ఇంకా చాలా బాగుందని అంటున్నారు..

ఫైనల్‌గాః `సంక్రాంతికి వస్తున్నాం`తో ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పక్కా. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకునే మూవీ.