ప్రముఖ ఆంగ్ల రచయిత్రి శోభా డే సంచలన వ్యాఖ్యలు.

ప్రముఖ ఆంగ్ల రచయిత్రి శోభా డే సంచలన వ్యాఖ్యలు చేశారు:

“ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఒక నిందితుడు పది రోజులు గడిచినా పోలీసులకు దొరకడం లేదంటే ఖచ్చితంగా తెరవెనుక ఎవరో ఉన్నారని అర్థం. ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోగలిగిన ఈ రోజుల్లో ఎవరి లొకేషన్ అయినా ఇట్టే కనుక్కోవచ్చు.”

మే నెల 12వ తారీఖు నాడు భోపాల్ నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మోడల్, నటి త్విష శర్మ కేసు గురించి మాట్లాడుతూ శోభా డే ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా ఇవ్వాళ తెల్లవారుజామునే కేసులో నిందితుడు త్విష శర్మ భర్త సమర్థ్ సింగ్‌ను పోలీసులు జబల్‌పూర్ వద్ద అరెస్ట్ చేశారు. కానీ సమర్థ్ సింగ్ న్యాయవాది మాత్రం తమ క్లయింట్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదని, అతనే స్వచ్చందంగా లొంగిపోవడానికి జబల్‌పూర్ కోర్టుకు వస్తే పోలీసులు పట్టుకున్నారని అన్నారు.

భర్త, అత్తమామలు వరకట్న వేధింపులు చేసి తమ బిడ్డను హత్య చేశారని త్విష తల్లితండ్రులు అరోపిస్తున్నారు.