*సంగారెడ్డి*
పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై కేసు నమోదు
*🔹BNS 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన BDL భానుర్ పోలీసులు*
45 మంది కార్మికుల మరణానికి కారణమైన పరిశ్రమపై కేసు నమోదు..
Sigachi Industries.
ఈ ప్రమాద ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, దీనిని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, జులై 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు, ఈ ఘటనపై రామారావు అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. సిగాచి పరిశ్రమ డైరెక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కమిషన్ను కోరారు…