SIR వ్యతిరేక నిరసనలో పాల్గొననున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త..

SIR వ్యతిరేక నిరసనలో పాల్గొననున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త

అక్టోబర్ 23వ తేదీన SIRకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్న సీజేపీ మరియు ఇతర యాక్టివిస్టులు

ఈ నిరసనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ పాల్గొననుండడం చర్చనీయాంశం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఆర్థికవేత్త, విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ వీలున్నప్పుడల్లా విచిత్రంగా ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. స్వయంగా తన శ్రీమతి కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. ఐనప్పటికీ వీరిరువురూ రాజకీయంగా పరస్పరం విభేద భావాలను కలిగి వుండటం విస్మయానికి గురిచేస్తుంది. అక్టోబరు 23న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద SIRకి వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమాలలో ఆయన పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు…గతంలోనే ఆయన SIR వల్ల ఇప్పటివరకూ ఆరున్నర కోట్ల మంది ఓటర్ల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ప్రక్రియ పూర్తయ్యేలోపుగా దేశవ్యాప్తంగా సుమారు 16.5 కోట్ల మంది ఓట్లను తొలగించే ప్రమాదం వుందని విమర్శించారు. కొన్ని కోట్ల మంది ఓటర్లను దేశ రాజయ సమాజం నుంచి తొలగిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. పరకాల ప్రభాకర్ విమర్శలు కొత్తేమీ కాదు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారమన్ చేసిన వ్యాఖ్యలను పరకాల తప్పుబట్టారు. ఇప్పుడిక జంతర్ మంతర్ వద్ద SIRకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.