మీరు మా నాన్న బండి దాచిపెట్టారు” కార్డన్ సెర్చ్ చేయడానికి వచ్చిన పోలీసులకు, తన తండ్రి దాచిపెట్టిన బండిని పట్టించిన ఆరేళ్ల కొడుకు
మీరు మా నాన్న బండి దాచిపెట్టారు” కార్డన్ సెర్చ్ చేయడానికి వచ్చిన పోలీసులకు, తన తండ్రి దాచిపెట్టిన బండిని పట్టించిన ఆరేళ్ల కొడుకు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో సాధారణంగా నిర్వహించే కార్డన్ సెర్చ్లో భాగంగా ప్రతి ఇంట్లో వస్తున్న ప్రతి ఇంట్లో వాహనాలను తనిఖీ చేసే పనిలో పడిన పోలీసులు తన వద్ద ఉన్న సరైన పత్రాలు లేవంటూ వస్తున్న సమయంలో తన వద్ద బండిని బండిని బండిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న సురేష్ అనే వ్యక్తి చూపించిన సురేష్ కొడుకు మహేంద్ర (6)..
https://x.com/TeluguScribe/status/2090743372462096574?s=20
ఇంకొంత మంది పక్క వీధిలోకి తీసుకెళ్లి బైక్ లను పార్కింగ్ చేసి తమది కాదన్నట్లు బిల్డప్ లు ఇస్తారు. అచ్చం ఇలాంటి ఘటన ఏపీలోని నెల్లూరులో కార్డన్ సెర్చ్ లో పోలీసులకు ఎదురైంది. కానీ ఇక్కడ సదరు వ్యక్తి కొడుకు తండ్రిని అడ్డంగా పోలీసులకు పట్టిచ్చాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా అనంతసాగరంలోని ప్రాంతంలో.. ప్రతి ఇంట్లో వాహనాలను పోలీసులు తనిఖీచేపట్టారు ఇంతలో అక్కడుండే సురేష్ అనే వ్యక్తి తన టూవీలర్ కు సరైన పత్రాలు లేవని పక్క వీధిలొకి తీసుకెళ్లి పెట్టేసి వచ్చాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు.
దీన్ని కాస్త అతని ఆరేళ్ల కొడుకు మహేంద్ర గమనించాడు. మరీ అతనికి స్కూళ్లో మంచి విద్యాబోధన,సరైన విధంగా పాఠాలు చెప్పినట్లు ఉన్నారు. నిజం మాట్లాడాలి.. అబద్దం చెప్పకూడదు. పోలీసులకు నిజాలే చెప్పాలని చెప్పినట్లున్నారు. ఇంతలో పోలీసులు అక్కడకు రాగానే బాలుడు మహేంద్ర తన తండ్రి బైక్ ను మీరు వస్తున్నారని పక్క వీధిలో బండి దాచిపెట్టాడని చెప్పాడు. అంతే కాకుండా వారిని తీసుకెళ్లి మరీ బండి ఎక్కడుందో చూపించాడు.దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి బండి పత్రాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేక పొవడంతో సురేష్ బైక్ ను పోలీసుుల స్వాధీనం చేసుకున్నారు. తన తండ్రిని పట్టించిన బుడ్డొడిపై ప్రశంసలు కురిపించారు. ఇంత చిన్న వయసులో ఈ తెగువను చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.