స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే… తగ్గిన ఐఫోన్ ధర..!

భారతదేశంలో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ (iPhone) కొనుగోలు చేయాలని ఆశపడేవారు ఆసక్తిగా ఎదురుచూసేది ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days) సేల్ కోసమే. ఐఫోన్ రేట్లు భారీగా ఉండటం.. బడ్జెట్ సహకరించకపోవడం వల్ల ఫోన్ కొనడాన్ని వాయిదా వేసుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఈ సేల్ ఒక పెద్ద వరప్రసాదం. ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 (iPhone 15) తో పాటు ఐఫోన్ 16 (iPhone 16) మోడళ్లపై కంపెనీలు, ఈ-కామర్స్ దిగ్గజాలు ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో ఇవి విడుదలైనప్పటి ధరలతో పోలిస్తే… ఈ సెప్టెంబర్ లో జరగబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీ డిస్కాట్లు లభించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆపిల్ కంపెనీ పరిచయం చేసిన డైనమిక్ ఐలాండ్, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు టైప్-సి (USB Type-C) ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన హంగులతో వచ్చిన ఐఫోన్ 15 మోడల్‌కు.. ఇప్పటికీ టెక్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. రిలీజ్ నాటికి ఈ ఫోన్ ధర (Launch Price) 128GB వేరియంట్ ₹79,900 వేలు ఉండగా.. డిస్కౌంట్ పోగా ₹69,900కు లభిస్తోంది. ఇక ఈ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ₹54,999 (ఫ్లాట్ డిస్కౌంట్)కి వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు దీనితో పాటు బ్యాంక్ ఇచ్చే ఆఫర్లు, కంపెనీ ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను కస్టమర్లు ఏకంగా ₹49,999 కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన లాంచ్ ధరతో పోలిస్తే వినియోగదారులు దాదాపు ₹30,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.