రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..!

సూర్యాపేట జిల్లా కేంద్రంలో.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయి లో చివరి వ్యక్తి వరకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాక్షించారు. ఉద్యోగులు గత సంవత్సరం ఎలా విధులు నిర్వర్తించారో ఈ నూతన సంవత్సరం ఎలా విధులు నిర్వర్తించాలో సింహలోకనం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి అవగాహన తెచ్చుకొని ఎలాంటి లోటు పాట్లు లేకుండా పథకానికి అర్హతలను బట్టి లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు.

సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలనూ అధికారులు అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఒక టీం లాగా ఏర్పడి పథకం యొక్క ఆశయాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సూచించారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటికి తక్షణమే పరిష్కరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

శాఖల అధికారులు, సిబ్బంది ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేలా కార్యచరణ రూపొందించుకోని గందరగోళం లేకుండా సరైన దృష్టి తో ముందుకెళ్లాలని సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా గుర్తించాలని కోరారు.

విధులు అలసత్వంలో గాని,లక్ష్యాన్ని చేరుకునే విషయంలో గాని ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
పరిపాలనలో ఉద్యోగులే బలం, బలగమని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఉద్యోగులు హార్డ్ వర్క్ చేసుకుంటూ అదనపు సమయం కేటాయించాలని అన్నారు.

భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బలపడిందని అలాగే రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగా సూర్యాపేట జిల్లాను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఉద్యోగులు కృషిచేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయాలని ఆదేశించారు.

ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్యోగ భాద్యతతో పాటు ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.

*రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ*

జనవరి 2026 మాసాన్ని రోడ్డు భద్రత మాసంగా గుర్తించడం జరిగిందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని కలెక్టరేట్ కార్యాలయంలో రెండు వారాలపాటు హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదని తదుపరి జరిమానా కూడా విధించడం జరుగుతుది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్, షీట్ బెల్ట్ ధరించాలని కోరారు.

తదుపరి వివిధ సంఘాల చే తయారు చేయబడిన డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జెడ్పి డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఆర్డీవోలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవ్, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు హాజరైనారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959