తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరిలో భారీ రద్దీ.

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరిలో భారీ రద్దీ.

తిరుమల: కలియుగ దైవం శ్రీవారిని వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఓవైపు వైకుంఠ ఏకాదశి, మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా భారీగా తరలివచ్చారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులుతీరి ఉన్నాయి. గరుడ సర్కిల్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ ఏకాదశికి టోకెన్లు లేకపోయినప్పటికీ కొత్త ఏడాదిలో తిరుమలలో గడపాలని భక్తులు సుదూరప్రాంతాల నుంచి తరలివచ్చారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959