దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ప్రణాళికలను పరిపూర్ణంగా అమలు చేశారు, స్పష్టమైన ఉద్దేశ్యంతో మరియు ఖచ్చితత్వంతో పనిచేశారు, ఆదివారం T20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియాపై ప్రోటీస్ 76 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది..
భారీ ఛేదనలో భారత టాపార్డర్ కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్(0) డకౌట్‌తో మొదలు.. పవర్ ప్లేలోనే వికెట్లతో దక్షిణాఫ్రిక బౌలర్లు టీమిండియాపై ఒత్తిడి పెంచారు….
క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్(18) గేర్ మార్చే క్రమంలో షార్ట్ మిడ్వికెట్లో బ్రెవిస్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు. అంతే.. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది భారత్. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, శివం దూబేలు ఆడుతు. 10 ఓవర్లకు స్కోర్.. 57-5. అందించారు..ఆరంభంలో కట్టడి చేసి.. ఆపై పట్టు సడలించి దక్షిణాఫ్రికాకు భారీ స్కోర్ అవకాశమిచ్చిన టీమిండియా ఛేదనలో తడబడుతోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(0)ను ఎడెన్ మర్క్రమ్ ఔట్ చేయగా.. యాన్సెన్ తొలి బంతి ఎడ్జ్ తీసుకోగా తిలక్ వర్మ(1) వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే…దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ విఫలం కాగా, ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులో నిలదొక్కుకుని ఆడడంతో దక్షిణాఫ్రికా మంచి స్కోరు చేయగలిగింది…
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ 4, క్వింటన్ డికాక్ 6, ర్యాన్ రికెల్టన్ 7, డెవాల్డ్ బ్రేవిస్ 45, డేవిడ్ మిల్లర్ 63, ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్), మార్కో జాన్సెన్ 2, కార్బిన్ బోష్ 5, కగిసో రబాడా 0 పరుగులు చేశారు..
తొలి ఇన్నింగ్స్‌లో 35 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు విజయానికి నాంది పలికిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు..
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో గ్రూప్ 1లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మరియు జింబాబ్వే జట్లు ఉండగా, గ్రూప్ 2లో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మరియు శ్రీలంక జట్లు ఉన్నాయి..