NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ సీనియర్‌ నేత సీపీ రాధాకృష్ణన్…!

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ సీనియర్‌ నేత సీపీ రాధాకృష్ణన్ను నియామించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఆయన ఝార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు. కోయంబత్తూర్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

రాధాకృష్ణన్ రాజకీయ జీవితం
1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌ తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి 2సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన సేవలు అందించారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ విధంగా ఆయన తమిళనాడు బీజేపీ సీనియర్‌ నాయకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు..