నేటి నుంచి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం….

ఏపీలో నేటి (సోమవారం) నుంచి 45 రోజుల పాటు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, సూపర్-6 హామీలు, లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వివరిస్తారని టీడీపీ వెల్లడించింది….

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా, ప్రభుత్వ పాలనా విజయాలను ప్రజలకు చేరువ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ జనచైతన్య కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. సోమవారం నుంచి మొదలయ్యే ఈ ప్రచారం రాబోయే 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.