తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ సమ్మెపై చర్చ.. !

తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ సమ్మెపై చర్చ..

ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రాణాలు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదు.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం..

రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ అవుతారు-సీఎం రేవంత్‌ రెడ్డి..

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేసిన ఆయన.. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు..ఈ నేపథ్యంలో రేపు TGS RTC JACను చర్చలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు పిలుపు నిచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల బృందం కార్మిక సంఘాలతో భేటీ కానుంది..