రాష్ట్రంలో కొత్త పథకం.. రేపటి నుంచి అమలు..

*🔹రాష్ట్రంలో కొత్త పథకం.. రేపటి నుంచి అమలు*

_• రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది._

*• తొలి దశలో 50వేలు, 1లక్ష రుణాలకు ఎంపికైన లక్ష మందికి మంజూరు పత్రాలు అందజేయనుంది..*

తర్వాత దశల వారీగా 4 లక్షల వరకు రుణాలను ఇవ్వనుంది.

ఈనెల 9 వరకు మంజూరు పత్రాల పంపిణీ, 10-15 వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇవ్వనుండగా, 15 నుంచి యూనిట్లు గ్రౌండింగ్ కానున్నాయి.

ఈ ఏడాది 6వేల కోట్లతో మొత్తం 5 లక్షల మందికి ఈ స్కీమ్ అమలుకానుంది…

తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందించనున్నారు. శిక్షణ జూన్ 10 నుంచి 15 వరకు, యూనిట్ల గ్రౌండింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది..లబ్ధిదారుల తుది జాబితా బ్యాంకుల నుంచి వచ్చి, ఇన్‌చార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లకు చేరినట్టు ఎస్సీ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. మొదటి దశలో రూ.50,000, రూ. లక్ష వరకు రుణాలకు అర్హత సాధించిన లక్ష మందికి రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు..ఈ ఏడాది స్కీమ్ కింద 5 లక్షల మందికి మొత్తం బడ్జెట్ రూ.6,000 కోట్లతో లబ్ధిచేకూరనుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మే 27న ముగియనుంది. ఈ పథకానికి నాలుగు రకాల రుణాల కేటగిరీలకు మొత్తం 16.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల రుణాలకు అత్యధికంగా 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
.