తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తమిళనాడు గవర్నర్ తీవ్రంగా స్పందించారు..సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపత్తూన్ వద్ద కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు గవర్నర్..
సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయలేదా?
నవంబర్ 20న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపత్తూన్ వద్ద కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదో వివరించాలని గవర్నర్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసిందో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. కార్తీక దీపం వెలిగింపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు, సంబంధిత అధికారుల మధ్య జరిగిన అధికారిక సమాచార మార్పిడి వివరాలను కూడా అందించాలని కోరారు…సీఎం విజయ్ ప్రభుత్వానికి వివరణ కోరిన గవర్నర్
తిరుపరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీపం వెలిగించకపోవడానికి గల కారణాలు, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. దీంతో సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది…
మదురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం కొండపై దూపతూణ్ రాతి స్తంభం వద్ద నవంబరు 24న కార్తీక దీపం వెలిగించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు మదురై జిల్లా కలెక్టర్ సమర్పించిన స్టేటస్ కో రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టను పరిశీలిస్తామని, అలాగే కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే, దురదృష్టవశాత్తు ‘దీపతూణ్’ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించలేకపోయామని, పరిణామాలను వివరిస్తూ నివేదిక దాఖలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ ధర్మాసనానికి నివేదించారు..
కోర్టు ధిక్కార చర్యలకు డిమాండ్.
నిర్దేశిత ప్రదేశంలో కార్తీక దీపాన్ని వెలిగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడ్విట్లను దాఖలు చేయాలని పిటిషనర్‌తో పాటు ఇతర పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తప్పకుండా విచారణ జరుపుతామని కోర్టు వారికి హామీ ఇచ్చింది.
తిరుప్పరంకుండ్రంలో సంప్రదాయ దీపాన్ని వెలిగించే విషయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో కలెక్టర్ ఈ నివేదికను సమర్పించారు. మంగళవారం సాయంత్రం దీపతూణ్ రాతి స్తంభం వద్ద కాకుండా ఉచ్చి పిళ్లైయార్ ఆలయంలో మహా దీపాన్ని వెలిగించారు. దీంతో హిందూ సంస్థలు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను టీవీకే (TVK) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆరోపించారు.