వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం..
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సృష్టించిన డబుల్ సెంచరీ విధ్వంసంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ (Ricky Ponting) ప్రశంసల వర్షం కురిపించారు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసి ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు..
తరంలో ఒకరే పుడతారు. వైభవ్ లాంటి అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఒక తరంలో ఒకరే పుడతారని పాంటింగ్ అభివర్ణించారు… బీసీసీఐ ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ వహించి వైభవ్ కు మద్దతుగా నిలవాలని అన్నారు… ఇలాంటి ఆటగాడికి మరికొన్ని స్కిల్స్ అందించి ప్రపంచం మెచ్చే ఆటగాడిలా తీర్చిదిద్దొచ్చని అన్నారు…