ఆధ్యాత్మిక సత్యంతో కూడిన నీతి కథ….!!!

ఆధ్యాత్మిక సత్యంతో కూడిన నీతి కథ.

పూర్వము ఒకవూరిలో రామ రాజు,…. భీమ రాజు అనే స్నేహితులు వుండే వారు. రామ రాజుకు ఒక కొడుకు, భీమ రాజుకు ఒక కూతురు వున్నారు. ఒక రోజు రామరాజు భీమ రాజు దగ్గరకు వచ్చి నేను అవసరార్థం నా పొలం అమ్మదలుచుకున్నాను, అది నీవు తీసుకొని నాకు డబ్బు యివ్వు అన్నాడు.సరే అని భీమరాజు ఆ పొలం కొన్నాడు.అందులో విత్తనం వేద్దామని దున్నుతుండగా నాగలికి తగులు కొని ఒక బిందె బయటికి వచ్చింది.
దాని నిండా బంగారు నాణాలు వున్నాయి.భీమ రాజు ఆ బిందె తీసుకొని రామరాజు యింటికి వెళ్లి నీ పొలం దున్నుతుంటే ఈ బిందె దొరికింది. పొలం నీదే కదా ఈ బిందె నీకే చెందుతుంది.అన్నాడు. దానికి రామరాజు
పొలం నీకు అమ్మేశాను కదా! అది నాదెలా అవుతుంది?ఆ బిందె నీదే అవుతుంది అన్నాడు.అందుకు భీమరాజు
నేను నీ పొలానికి మాత్రమె డబ్బు యిచ్చాను.బిందెకి కాదు కదా!అలాంటప్పుడు ఈ బంగారు నాణాల బిందె నీదే అన్నాడు. యిద్దరూ కాసేపు వాదులాడుకొని తర్వాత తీర్పు కోసం ఆ దేశం రాజు గారి దగ్గరకు వెళ్ళారు.
ఇద్దరి వాదనలను విన్న రాజుగారు వారి ధర్మ నిరతికి ఆశ్చర్య పోయారు. మీ యిద్దరికీ ఒకరికి కూతురూ
ఒకరికి కొడుకు వున్నారు కదా వారిద్దరికీ పెళ్లి చేసి ఆ ధనం వారిద్దరికీ యిచ్చి వేయండి. వారిద్దరూ దానితో ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా వుంటారు. అని తీర్పు చెప్పి భీమరాజుకు కూతురి పెళ్లి చేయటానికి తగిన ధనం యిచ్చి నీ కూతురి పెళ్ళికి యిది నా కానుక అని చెప్పాడు. “ధర్మో రక్షతి రక్షితః ”