తగ్గిన టోల్ రుసుములు..

హైదరాబాద్-విజయవాడ జాతీయ
రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్
రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల
NHAI నిర్ణయం తీసుకుంది…

తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ 1 (31 అర్ధరాత్రి) నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ (65) జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలు ఉన్నాయి.
అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి 15 రూపాయలు
ఇరువైపులా కలిపి రూ.30 రూపాయలు తగ్గింపు,,
తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు,, ఇరువైపులా కలిపి 40 రూపాయలు తగ్గింపు..
బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి 50 రూపాయలు,, ఇరువైపులా కలిపి 75 రూపాయల వరకు వరకు తగ్గించారు.
24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25 శాతం మినహాయింపు లభిస్తుంది.
2026మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉండనున్నాయి,,,
యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5
కిలోమీటర్లను GMR సంస్థ రూ.1,740 కోట్లతో బీవోటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబరులో టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గతేడాది జులై 1 నుంచి టోల్ వసూళ్లను NHAI ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. జీఎమ్మార్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్
రుసుములను పెంచుకునేందుకు అవకాశం ఉండేది.ఇప్పుడు ఎన్ హెచ్ ఐ ఆధీనంలో ఉండడంతో టోల్ రుసుమును తగ్గించారు… తగ్గిన టోల్ రుసుముల చార్జీలు ఈ అర్ధరాత్రి12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.