*యాదాద్రి జిల్లా:
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
* కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు..
* పంతంగి టోల్ ప్లాజాలో.. విజయవాడ వైపు 8 టోల్ ఎంట్రీల ఓపెన్..
హైదరాబాద్ వైపు 3 లైన్ లు విజయవాడ వైపు తెరవడం తో హాండ్ గన్స్ తో స్కాన్ చేస్తున్న సిబ్బంది..
ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు..
విద్యాసంస్థలకు ఈరోజు నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. అయితే సాధారణంగా దిల్సుఖ్నగర్ నుంచి చౌటుప్పల్‌కు 1 గంటలో చేరుకోవచ్చు. కానీ గత ఏడాది సంక్రాంతి సమయంలో భోగి ముందు రోజు 3-4 గంటల సమయం పట్టింది. అంతకు 2 రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది.
ఇవాళ్టి నుంచే సెలువులు ప్రారంభమవుతుండటంతో ఈ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ రహదారిపై అండర్‌పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు దానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మార్గాల్లో వెళ్తే సులువుగా :
హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి వరకు వెళ్లి, అద్దంకి నేషనల్ హైవేపై నుంచి వెళ్తుంటారు. ఒకవేళ వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. ఈ నార్కట్‌పల్లి మీదుగా వెళ్లడం వల్ల పదుల కిలోమీటర్లు దూరం పెరిగినా, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అలాగే ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలనుకునే వారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జునసాగర్ హైవేపైకి వెళ్తే సరిపోతుంది.
హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్కేసర్లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించొచ్చు. సిక్రింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ వైపు నుంచి కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్‌పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్లే.
చౌటుప్పల్‌లో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఆరోజు చౌటుప్పల్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పండగ వేళ ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959