గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!?

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు..ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..