నిరుద్యోగులకు TSRTC గుడ్ న్యూస్…

*నిరుద్యోగులకు TSRTC గుడ్ న్యూస్..*

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) 2021-22 విద్యా సంవత్సరంలో ఐటీఐ పాసైన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఇందు కోసం డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్, మోటార్‌ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజినల్‌ పరిధిలోని 12 డిపోల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apprenticeshipindia.org వెబ్ సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.