జనవరి 3న పౌర్ణమి గరుడసేవ రద్దు.!

జనవరి 3న పౌర్ణమి గరుడసేవ రద్దు.!

తిరుమల, 2026 జనవరి 02:
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 3వ తేదీన నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది.
ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీమన్నారాయణుడికి గరుడవాహనంపై గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా ఈ నెల పౌర్ణమి గరుడసేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి అధికారిక ప్రకటన విడుదల చేశారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959