తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్..త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది.
ప్రస్తుతం పగటి ప్రయాణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు కొనసాగింపుగా, రాత్రి ప్రయాణాలకు అనువైన స్లీపర్ కోచ్‌లతో కూడిన వందే భారత్ రైలు సేవలు ప్రారంభించనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ముఖ్య నగరాల మధ్య ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రైళ్లు అత్యాధునిక సదుపాయాలు, అధిక వేగంతో ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే నుంచి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్-ఢిల్లీ మధ్య ప్రారంభిస్తే ప్రయాణికులకు సేవలు మరింత మెరుగుపర్చవచ్చని రైల్వేశాఖ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959