మిస్సైల్ విక్రయానికి ఉక్రెయిన్‌కు అమెరికా స్ట్రేట్ డిపార్ట్మెంట్కు చెందిన పొలిటికల్-మిలిటరీ ఎఫైర్స్ బ్యూరో ఆమోదం…!
ఉక్రెయిన్‌కు 500 ‘పేట్రియాట్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ-3’ (PAC-3) MSE క్షిపణులు, అనుబంధ పరికరాలను విక్రయించేందుకు నిమిత్తం 2.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.17,500 కోట్ల విదేశీ సైనిక విక్రయ ఒప్పందానికి (FMS) అమెరికా స్ట్రేట్ డిపార్ట్మెంట్కు చెందిన పొలిటికల్-మిలిటరీ ఎఫైర్స్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం యూరప్‌లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి కీలక భాగస్వామిగా ఉన్న ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది..అమెరికా నిధులు లేకుండానే కొనుగోలు..
ఈ భారీ కొనుగోలుకు అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిధులనూ వెచ్చించడం లేదు. దీనికి సంబంధించి అవసరమయ్యే నిధులను పశ్చిమ దేశాల భాగస్వామ్యం ద్వారా సేకరిస్తున్నారు. కెనడా, జర్మనీ, నార్వే దేశాలు తమ విరాళాల ద్వారా ఈ ప్రోగ్రామ్ కింద నిధులు అందిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఐరోపా సమాఖ్య (EU) అందించే ‘ఉక్రెయిన్ సపోర్ట్ లోన్’ సాయంతో ఉక్రెయిన్ సొంత జాతీయ నిధుల ద్వారా చెల్లించనుంది. రష్యా నుంచి పెరుగుతున్న క్షిపణి, వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు ఈ అత్యాధునిక PAC-3 MSE మిసైళ్లు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవహారాలకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి..