పెళ్లి నిరాకరించిందనే కక్షతో చిన్నారిని నేలకేసి కొట్టి హత్య చేసిన కిరాతకుడు..!

పెళ్లి నిరాకరించిందనే కక్షతో చిన్నారిని హత్య చేసిన కిరాతకుడు..

చిన్న పాప అని కూడా చూడకుండా నేలకేసి అత్యంత దారుణంగా కొట్టిన ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రతి దేవి వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన జితేంద్ర అలియాస్ విరాజ్, ఆమె చిన్నారి కుమారుడు ఆరవ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.

చాక్లెట్ కొనిస్తానని చెప్పి చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లిన నిందితుడు, నిర్మానుష్య ప్రాంతంలో అతడిపై దారుణంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదుకాగా, కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.