వెడ్మ ఫౌండేషన్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఎమ్మెల్యే ప్రాణ స్నేహితుడు..!
ఇదీ ఖానాపూర్ ఎమ్మెల్యే అనుచరుడి భాగోతం
వెడ్మ ఫౌండేషన్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఎమ్మెల్యే ప్రాణ స్నేహితుడు
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు.. వందల మంది బాధితులు
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఉద్యోగాల పేరిట భారీ స్కాం
300 మంది పైగా అభ్యర్థుల నుండి రూ.20 వేల నుండి రూ.50 వేల వరకు వసూలు చేసిన నిర్వాహకుడు జాడే కిషన్ అలియాస్ కృష్ణ
కార్పొరేట్ తరహాలో కార్యాలయాలు నెలకొల్పి, స్థానిక ప్రజాప్రతినిధులను కార్యాలయాల ప్రారంభోత్సవానికి పిలిపించి నిరుద్యోగులను మభ్యపెట్టిన జాడే కిషన్
స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రధాన అనుచరుడు మరియు ఎమ్మెల్యే పేరిట నిర్వహిస్తున్న వెడ్మ ఫౌండేషన్ నిర్వాహకుడిగా ఉన్న జాడే కిషన్
ఉట్నూర్ మండల కేంద్రంలోని వెడ్మ ఫౌండేషన్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుడు జాడే కిషన్ గత కొన్ని రోజుల క్రితం ఉట్నూర్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానని వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని ఉడాయించిన జాడే కిషన్
ఎమ్మెల్యే అనుచరుడని ఎలాగైనా ఉద్యోగాలువస్తాయనే ఆశతో అతని మాటలు నమ్మి ఏదో ఒక ఉద్యోగం వస్తే కుటుంబాలను పోషించవచ్చనే ఆశతో అప్పో సప్పో చేసి వారికి చెల్లించి.. చివరకు మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితులు..