ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

*బుకింగ్ విధానం*

భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు.

* సేవలను సులువుగా పొందడానికి ‘95523 00009’ అనే వాట్సాప్ నెంబర్ను ప్రవేశపెట్టారు*.

దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవలు పొందొచ్చు.

*🎯 ముందుగా మీ మొబైల్లో ‘9552300009’ అనే నంబర్ సేవ్ చేసుకొని ‘Hi’ అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే ‘దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది.*

అనంతరం శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ(Vijayawada), శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి.

అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందవచ్చు.