ఉత్తర తెలంగాణలో పెరిగిన చలితీవ్రత..
పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ దాటని టెంపరేచర్స్.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 5.6 డిగ్రీలు
సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు.
Weather Alert.
గడ్డ కట్టే చలికి తెలంగాణ రాష్ట్ర గజగజ వణికిపోతుంది. గత మూడు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర చలితో జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. మేఘాలు లేకపోవడం, హిమాలయాల నుంచి చల్లని గాలులు రావడమే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట,వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959