అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు..!

యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

ఎనిమిదో రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా…. స్వామి వారిని హనుమంత వాహనంపై శ్రీరామ అవతారంలో ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేసిన యాదగిరీశుడు.

శ్రీరామ అలంకార.

సేవపై నయనమనోహరంగా అలంకరించి వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తీరువీధుల్లో ఊరేగించి
ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ అవతార విశిష్టతను భక్తులకు తెలియజేసారు.
ఆలయ అర్చకులు.

అలాగే ఈరోజు రాత్రి 9 గంలకు. స్వామి వారిని గజవాహన సేవపై ఊరేగించి అనంతరం ఆలయమాడ వీధిలో ఉన్న కళ్యాణ మండపంపై మంగళ వాయిద్యాలతో తీసుకువచ్చి వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.