డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి..ఎస్పీ నరసింహ..

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టౌన్ హాల్లో జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ..
ఈ సందర్భంగా హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆలోచనలతో హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో హెవీ వెహికల్, ఆటో కార్ డ్రైవర్లకు , ఎరైవ్, ఏలైవ్, అనే కార్యక్రమాన్ని రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు రూపొందించడం జరిగిందని ఇది నిరంతర ప్రక్రియగా ప్రతి నెలకొకసారి పట్టణాల్లో గ్రామాల్లో నిర్వహిస్తామని తెలిపారు. …

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది చనిపోతున్న కారణంగా డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ..

గత 30 40 సంవత్సరాలుగా డ్రైవింగ్ వృత్తిలో ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగడం ప్రధాన కారణమైతే రెండవ కారణం కంటి చూపు మందగించడం అని తెలిపారు…

అందుకే ప్రధానంగా ఆటో నుండి
మొదలుకొని అన్ని విభాగాల్లో డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు..

అనంతరం డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ
డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు పాటించవలసినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ మద్యానికి దూరంగా ఉండాలని అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యం పై శ్రద్ధతో ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ కంటి చూపును పరీక్షించుకొని ఉచితంగా కళ్ళజోళ్ళు తీసుకొని ఆనంద సుఖశాంతులతో ఉండాలని తెలిపారు. ..

ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ ప్రవీణ్ కుమార్, కోదాడ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు కంటి వైద్య నిపుణుల బృందం గరిడేపల్లి పాలకవీడు హుజూర్నగర్ మండలాల ఎస్ఐలు పలువురు సిబ్బంది పాల్గొన్నారు..