పురుగుల మందు డబ్బాలతో యాదాద్రి జిల్లా జానకీపురం రైతుల నిరసన..!

నీళ్లియ్యకుంటే మూకుమ్మడిగా సస్తం..బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి.. లేకుంటే చావే శరణ్యం..!

• పురుగుల మందు డబ్బాలతో యాదాద్రి జిల్లా జానకీపురం రైతుల నిరసన

అడ్డగూడూరు బిక్కేరువాగు లోకి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తా యని, లేకుంటే తమకు చావే శరణ్యమని రైతులు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీ పురం గ్రామంలో పొలాల్లో రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలిపారు. గ్రామంలో సుమారు వందమంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాలు ఎండిపోతున్నదని ఆందోళన చెందారు. బిక్కేరువాగు గుండా 10 రోజుల పాటు నీటిని వదిలితే చెక్ డ్యా మ్ లు నిండి తమ పంటలు పండుతాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని వరి పొలాలు నీళ్లు లేక ఎండగా పశువులకు మేతకు వదిలేశా మని, మిగిలినవి పంటలనైనా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి రాలేదని, గతంలో ఉన్న ప్రభుత్వాలు సమయానికి రైతుబంధు ఇచ్చి పంట సాయంగా ఆదుకునే వారిని కాలువల ద్వారా నీళ్లు అందించి చెరువులు నింపే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు వచ్చిందని, ఎమ్మెల్యే మందుల సామేల్ చొరవ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు…….