యాదగిరిగుట్ట ఆలయంలో నేడు వరుణ యాగం..

యాదగిరిగుట్ట ఆలయంలో రేపు వరుణ యాగం
మూడు రోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగం.

ఎల్‌నినోతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులకారణంగా యాగం..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం, మూడు రోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని తలపెట్టారు. ఈ యాగంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.